'పర్యాటక ప్రాంతాల అభివృద్ధి వేగవంతం'
VSP: ఈనెల 18, 19వ తేదీల్లో విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల నేపథ్యంలో పర్యాటక ప్రాంతాల్లో జరుగుతున్న మరమ్మత్తులు, పచ్చదనం పెంపు పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో శుభ్రత, త్రాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.