మూలమలుపు వాహనదారులకు మృత్యుపాశం
KMM: బూర్గంపాడు మండలంలోని సారపాక-రెడ్డిపాలెం మూలమలుపు వాహనదారులకు మృత్యుపాశంగా మారుతోంది. రహదారికి ఇరువైపులా జామాయిల్ చెట్లు దట్టంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ రెండు బస్సులు ఢీకొన్న ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం గమనార్హం.