స్మశాన వాటికను పరిశీలించిన జనసేన పార్టీ ఇంఛార్జ్

స్మశాన వాటికను పరిశీలించిన జనసేన పార్టీ ఇంఛార్జ్

E.G: గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు దేవరపల్లి మండలం త్యాజంపూడిలో శుక్రవారం పర్యటించారు.  ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్మశాన వాటికను పరిశీలించి ఆరా తీశారు. స్థల సేకరణ, మౌలిక సదుపాయాల కల్పనపై హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ధవళ శ్రీనివాస్, మండల అధ్యక్షులు కాట్నం గణేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు.