అత్యాధునిక క్షిపణి తయారీలో ఉత్తర కొరియా!

అత్యాధునిక క్షిపణి తయారీలో ఉత్తర కొరియా!

ఉత్తర కొరియా ఇటీవల శక్తిమంతమైన క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించింది. తమ అణు వార్‌హెడ్‌లను అమెరికా వరకు మోసుకెళ్లేలా క్షిపణి సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటామని కిమ్ ప్రకటించారు. అయితే.. బహుళ వార్‌హెడ్‌లను సుదూరం మోసుకెళ్లేందుకు వీలుగా కార్బన్ ఫైబర్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల కోసమే ఈ ఇంజిన్‌ను పరీక్షించిందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.