VIDEO: 'ప్రతిపౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి'
WGL: వర్ధన్నపేట పట్టణంలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ జేఏసీ అధ్యక్షుడు తుమ్మల శ్రీధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు అంబేద్కర్ దేశ ప్రజలకు సమాన హక్కులు, న్యాయం, స్వేచ్ఛలతో కూడిన రాజ్యాంగాన్ని అందించారని, ప్రతిపౌరుడు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలన్నారు.