శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన MLA

శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన MLA

KRNL: బెలిగుండులోని గల క్షేత్ర గుడి ఆంజనేయ స్వామిని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.