పల్లె నుంచి పట్నం చేరిన పంచాయతీ
SRCL: జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పల్లెకు దూరంగా ఉన్నవారికి ఫోన్ చేసి 'అక్కా బాగున్నావా.. అన్నా బాగున్నావా' నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను, ఓటు నాకే వేయాలంటూ బ్రతిమిలాడుతున్నారు. కావాలంటే ప్రయాణ ఖర్చంతా తామే భరిస్తామని అంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వలస దారుల ఓట్లు కీలకంగా మారాయి.