ఇనుప గేట్లను దొంగలిస్తున్న ముగ్గురు పట్టివేత

ఇనుప గేట్లను దొంగలిస్తున్న ముగ్గురు పట్టివేత

KMM: తిరుమలాయపాలెం మండలంలో ఇనుప గేట్లు, గడ్డపారలు, పారలు దొంగలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. తిరుమలాయపాలెం సంత రోడ్డులో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా వచ్చిన ట్రాలీ వ్యాను ఆపి విచారించగా దొంగలుగా ఒప్పుకున్నారని చెప్పారు. సామాగ్రితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.