మహిళా లోకానికి కాంగ్రెస్ ద్రోహం: బండి సంజయ్
జగిత్యాల: భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండి' కూటమి తన అసలు రంగు బయటపెట్టుకుందని విమర్శించారు. సాధారణ మహిళలు చట్టసభలకు రావడం ఇష్టం లేకనే కుటుంబ పార్టీలన్నీ ఏకమై మహిళా హక్కులను కబళించాయని మండిపడ్డారు.