'అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు'
MLG: మంత్రి సీతక్కపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. మీడియాతో ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని, నిప్పులాంటి వ్యక్తిత్వం ఉండి నిత్యం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.