డ్వాక్రా బజార్ పోస్టర్ల ఆవిష్కరణ
SS: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అఖిల భారత డ్వాక్రా బజార్ - 2025 పోస్టర్లను మంత్రుల బృందం పుట్టపర్తిలో ఆవిష్కరించింది. మంత్రులు అనగాని, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తిలోని శిల్పారామంలో నవంబర్ 15 - 25 వరకు స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ కళాకారులు తయారుచేసిన చేసిన చేనేత, హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి.