పాక్ రెండుగా చీలిన విషయం మర్చిపోయారా?: రాజ్‌నాథ్

పాక్ రెండుగా చీలిన విషయం మర్చిపోయారా?: రాజ్‌నాథ్

పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 55 ఏళ్ల క్రితం పాక్ రెండుగా విడిపోయిన విషయం ఆయనకు గుర్తులేదా అంటూ చురకలంటించారు. 1971లో జరిగిన యుద్ధంలో పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశం ఏర్పడిన విషయం మరణిపోయారా అంటూ వ్యాఖ్యానించారు. నాడు బంగ్లాకు భారత సైన్యం అండగా నిలిచిందని గుర్తు చేశారు.