'లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవ లేకుండా చూడాలి'

'లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవ లేకుండా చూడాలి'

W.G: లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసు బాబు సూచించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మురుగు కాలువల్లో ఏర్పడిన బ్లాకులను పబ్లిక్ హెల్త్ సిబ్బంది సహకారంతో తొలగించాలన్నారు. డ్రెయినేజీ ఆక్రమణలు, పాడుబడిన భవనాల తొలగింపునకు నోటీసులు జారీ చేయాలన్నారు.