రాఖీ పండుగ వేళ చెట్టుకి రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పండుగ వేళ చెట్టుకి రాఖీ కట్టిన చిన్నారి

SRCL: సిరిసిల్లలో చిన్నారి ఆమూల్య రాఖీ పండుగ వేళ చెట్లకు రాఖీలు కట్టి పకృతిపై తనకున్న ప్రేమను చాటిచెప్పింది. అంబేద్కర్ నగర్‌కు చెందిన చెరుకు మోహన్, ప్రవీణల పెద్దకూతురు అమూల్య(9) 4వతరగతి చదువుతుంది. చిన్నవయసులోనే చెట్ల విలువను తెలుసుకొని చెట్లే మనకు నూరేళ్ళ రక్ష అని రక్షా బంధన్ రోజున తన ఇంటి ఆవరణంలోనీ 10 చెట్లకు రాఖీలు కట్టి పకృతి ప్రేమికుల మనస్సును గెలుచుకుంటుంది.