ఆధార్ క్యాంపును సందర్శించిన ఎంపీడీవో

ఆధార్ క్యాంపును సందర్శించిన ఎంపీడీవో

NLR: సంగంలో మంగళవారం ఆధార్ ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి షాలెట్ ఆధార్ క్యాంపును పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ఆధార్ కార్డులు లేని వారు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.