రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సీతామాధవి ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సీతామాధవి ఎంపిక

NLG: మర్రిగూడలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న కొండూరు గ్రామానికి చెందిన విద్యార్థిని సీతామాధవి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. SRPT జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన 35వ సబ్ జూనియర్ బాలికల టోర్నమెంట్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఈనెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్‌లో జరిగే టోర్నమెంట్‌లో ఆమె పాల్గొననుందని కోచ్ రమేష్ వెల్లడించారు.