ఒంగోలులో గోడపత్రికను ఆవిష్కరించిన DMHO
ప్రకాశం: ఒంగోలు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం వాయు కాలుష్యంపై గోడ పత్రికను DMHO వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా చిన్నారులు, బయట పనిచేసే మహిళలు, ట్రాఫిక్ పోలీసులు అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పరిసరాలు పరిశుభ్రత, కాలుష్యాన్ని నివారించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని DMHO తెలిపారు.