పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

NTR: తిరువూరు కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.