ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు: డీఎస్పీ
MHBD: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తిరుపతిరావు హెచ్చరించారు. శుక్రవారం నిర్వహించిన MHBD రూరల్ సర్పంచ్, వార్డు సభ్యుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని సూచించారు.