VIDEO: ఉద్యోగిని కాశిమ్మపై విద్యార్థులు దాడి అవాస్తవం

VIDEO: ఉద్యోగిని కాశిమ్మపై విద్యార్థులు దాడి అవాస్తవం

కృష్ణా: గన్నవరం మండలం గొల్లనపల్లి ఉన్నత పాఠశాల బాలుర వసతి గృహంలో ఉద్యోగిని కాశిమ్మపై విద్యార్థులు మద్యం మత్తులో దాడి చేశారన్న వార్త వాస్తవం కాదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షాహిద్‌బాబు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలపై విచారణ జరిపిన బృందం విద్యార్థులు మద్యం సేవించలేదని, కేవలం వాగ్వాదం జరిగిందని తేల్చింది. అయితే కాశిమ్మ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.