'సాదా భైనామా ధరఖాస్తులను పరిశీలించాలి'
SRPT: భూ భారతి చట్టం అమలులో భాగంగా సాదా భైనామా ధరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహసీల్దార్లతో రెవిన్యూ అంశాలపై వెబెక్స్ ద్వారా వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, ఈ సెక్షన్ సూపరింటిండెంట్ తదిరలు పాల్గొన్నారు.