'సంక్షేమ బోర్డును కొనసాగించాలి'
ELR: జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జై భీమ్ భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం సోమవారం నిర్వహించారు. మండల కన్వీనర్ చిట్టి బొమ్మ కొండలరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కొనసాగించాలని భవన నిర్మాణ కార్మికుల చట్టంలోని పథకాలను అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోర్డుని కొనసాగించాలన్నారు.