పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎంఈవోలు
KDP: కొండాపురంలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవోలు ఓబులేసు, రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండాపురం జడ్పీ హైస్కూల్, మండలంలోని తాళ్ల ప్రొద్దుటూరు జడ్పీ హైస్కూల్లలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కొండాపురంలో 399 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.