భూ సేకరణ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్
వనపర్తి జిల్లాలో చేపడుతున్న వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సర్వే ప్రక్రియలను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గణప సముద్రం రిజర్వాయర్ కోసం భూసేకరణలో భాగంగా పెండింగ్‌లో ఉన్న సర్వేలో ఈనెల 30 లోపు పూర్తి చేయాలి.