కమలాపురంలో ఉచిత వైద్య శిబిరానికి స్పందన
KDP: కమలాపురం శ్రీ వెంకటేశ్వర స్కూల్లో ఆదివారం మదర్ థెరిసా సమితి, కిమ్స్-సవీరా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ నగేష్, రామ సుబ్బారెడ్డి హాజరైన ఈ శిబిరంలో 100 మందికి గుండె, కంటి, దంత, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు ఉచితంగా చేశారు. పేదలకు ఇలాంటి శిబిరాలు ఎంతో మేలు చేస్తాయని నిర్వాహకులు తెలిపారు.