'పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలి'

NLG: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట దక్కింది. 16 ఏళ్లలోపు పిల్లలను 4 రెగ్యులర్ షోలకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. మరోవైపు తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.