డయేరియా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

డయేరియా నియంత్రణకు పకడ్బందీ చర్యలు

SKLM: సంతబొమ్మాళి M తాళ్లవలసలో డయేరియా కేసుల నివారణ, నియంత్రణపై జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఈ చర్యలు చేపట్టింది. ఈ బాధితులందరికీ తక్షణమే టెక్కలి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డయేరియా వ్యాప్తికి ఆస్కారం లేకుండా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సోమవారం వైద్యులు ఇంటింటా సర్వే చేశారు.