ముద్రగడను కలిసిన వైసీపీ ఎం.పి అభ్యర్థి సునీల్

తూర్పుగోదావరి: కిర్లంపూడిలో కాపు నాయకుడు ముద్రగడను వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మర్యాద పూర్వకంగా కలిసారు. సునీల్ మాట్లాడుతూ.. ముద్రగడ పార్టీలోకి రావడం శుభసూచికం అంటూ ఆయన రాకవల్ల పార్టీ మరింత బలపడిందని ముద్రగడ రాకతో కాకినాడ ఎంపీ, ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తామంటూ, పిఠాపురంలో వైసీపీ జెండా ఎగురుతుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు.