కార్తీకమాసం తొలి సోమవారం.. కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
BHPL: కార్తీక మాసం తొలి సోమవారం గణపురం కోటగుళ్లకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను అర్చకులు నాగరాజు ప్రారంభించారు. అనంతరం నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారి దర్శించుకొని పూజలు చేశారు.