ఆపరేషన్ బన్యన్ ఫొటో గిఫ్ట్.. ఆన్‌లైన్లో ట్రోల్స్

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను ప్రతిఘటించడానికి ఆపరేషన్ బన్యన్ చేపట్టామని పాక్ ప్రచారం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆర్మీ విన్యాసాలతో కూడిన ఓ ఫొటోను ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ బహుకరించారు. చైనా మిలిటరీ విన్యాసాల ఫొటోను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని తమ సైనిక సామర్థ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్నారంటూ నెటిజన్లు ఎద్దేవా చేశారు.