మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు

మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు

VSP: విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి 430 మంది మహిళా పోలీసులతో మంగళవారం సాయంత్రం సమావేశయ్యారు. ఈ కార్యక్రమంలో వారి విధులను ఖరారు చేశారు. ఇకపై రెగ్యులర్ పోలీసులతో కలిసి పనిచేసేలా డేటా ఎంట్రీ, దర్యాప్తు సాయం, కౌన్సెలింగ్, సమాచార సేకరణ వంటి 10 రకాల కీలక బాధ్యతలను వారికి ప్రతిపాదించారు. బదిలీలు, ఐడీ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.