టైలరింగ్ ట్రైనింగ్ క్యాంపును ఎమ్మెల్యే సతీమణి

టైలరింగ్ ట్రైనింగ్ క్యాంపును ఎమ్మెల్యే సతీమణి

MBNR: చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో కుట్టుమిషన్ టైలరింగ్ ట్రైనింగ్ క్యాంపును దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత తమ సొంత నిధులతో ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ఈ శిక్షణ లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, పేరూర్ గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.