VIDEO: ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్
SRCL: జిల్లాలోని 5 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిర్ణీత సమయం పూర్తి కాగానే పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న గేట్లను అధికారులు మూసివేశారు. గేట్ల లోపల ఉన్న ఓటర్లను మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, అధికారులు ఇక కౌంటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.