VIDEO: వైభవంగా శ్రీవీరాంజనేయ స్వామి వారి ప్రాకారోత్సవం
CTR: పుంగనూరు పట్టణ శివారులోని HMదిన్నెలో శ్రీవీరాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు శుక్రవారం సీతారామలక్ష్మణ హనుమంతుల వారి ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. తర్వాత ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఇవాళ సాయంత్రం సీతారాముల కళ్యాణం జరుగుతుందని చెప్పారు.