సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

ELR: ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి నదీ పుష్కరాలకి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు నరసాపురం డిపో మేనేజర్ సుబ్బన్నరెడ్డి తెలిపారు. వరంగల్లు, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప క్షేత్రాలు దర్శనం చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. టిక్కెట్ ఒక్కొక్కరికి రూ.2,400గా నిర్ణయించామన్నారు. 7382908122, 9959225486 నంబర్లకు సంప్రదించాలన్నారు.