ఎన్నికల సామాగ్రిని తరలించిన అధికారులు

ఎన్నికల సామాగ్రిని తరలించిన అధికారులు

RR: షాద్ నగర్ నియోజకవర్గంలో 153 గ్రామపంచాయతీలకు గాను 6 గ్రామపంచాయతీలో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. ఫరూఖ్ నగర్ మండలంలో 405 పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో గ్రామపంచాయతీ ఎన్నిక కోసం ఒక ఆర్వోను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండలంలో సుమారు 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సామాగ్రిని అధికారులు తరలించారు.