పెన్షన్ పంపిణీలో అలసత్వం వద్దు: ఎంపీడీవో
ASR: సామాజిక పెన్షన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన కొయ్యూరులో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. లబ్ధిదారులకు సక్రమంగా పెన్షన్లను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఎంపీడీవో స్వయంగా ఇంటింటికీ వెళ్లి పలువురు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.