స్మశానం ఆక్రమణపై విచారణకు కలెక్టర్ ఆదేశాలు

NLR: లింగసముద్రం మండలంలోని మాలకొండ రాయుని పాలెం పంచాయితీ ముక్తేశ్వరం ఎస్సీ కాలనీ స్మశానం ఆక్రమణకు గురైందని కాలనీవాసులు మంగళవారం సబ్ కలెక్టర్ హిమవంశికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ హిమవంశి, MROకు ఫోన్ చేసి స్మశానాన్ని సర్వే చేయించాలన్నారు. వారంలోగా నివేదికను అందజేయాలని, ఆక్రమణకు గురైతే చర్యలు తప్పవని కలెక్టర్ తెలిపారు.