విధుల్లోకి తీసుకోవాలని సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ

విధుల్లోకి తీసుకోవాలని సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ

MNCL: సింగరేణిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు చేస్తున్న ఆందోళన మంగళవారం కొనసాగింది. మందమర్రి పట్టణంలోని పాల చెట్టు నుంచి కాలనీల గుండా పెద్ద ఎత్తున సెక్యూరిటీ గార్డ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెల రోజులుగా డ్యూటీలు లేక 213 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.