VIDEO: ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి వారి నగర సంకీర్తన

ప్రకాశం: దర్శిలో మంగళవారం ప్రసన్నాంజనేయ స్వామి వారి నగర సంకీర్తనలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ నగర సంకీర్తనలు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరిన భక్తులు పట్టణ వీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయజయ రామ అంటూ సంకీర్తనలు ఆలపిస్తూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చలపతిరావు పంతులు పర్యవేక్షించారు.