అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
KNR: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను రేణిగుంట గ్రామ శివారులో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్‌ను స్వాధీన పరచుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఇలా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.