బస్సు ప్రమాదం.. పరామర్శించిన మంత్రి

బస్సు ప్రమాదం.. పరామర్శించిన మంత్రి

TG: చేవెళ్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.