అంగన్వాడీలను అభినందించిన సీతక్క
TG: హన్మకొండ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు. సెలవు దినం అయినప్పటికీ, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు స్వయంగా బాలమృతం వండి, వరద ప్రాంతాల నుంచి రక్షించబడిన చిన్నారులకు అందించారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క వారి మానవతా దృక్పథం, గొప్ప సేవాభావాన్ని అభినందించారు.