ఐదు అర్జీలు స్వీకరించిన ఎంపీడీవో

NLR: విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి మొత్తం ఐదు అర్జీలు వచ్చాయని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి నగేష్ కుమారి చెప్పారు. డెత్ సర్టిఫికేట్, వితంతు పెన్షన్ పై అర్జీలు వచ్చాయన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరిస్తామన్నారు.