VIDEO: భారీ వర్షంతో నేలకొరిగిన పూరి గుడిసె
TPT: అల్పపీడనం ప్రభావంతో ఏర్పేడు మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని నచ్చనేరి గ్రామం ఎస్డీ కాలనీలో నివాసం ఉంటున్న ఈశ్వరమ్మకు చెందిన పూరి గుడిసె పడిపోయింది. ఎటువంటి ప్రమాదం జరగలేదlని, ఇంత జరిగినప్పటికీ అధికారులు ఎవరు కూడా స్పందించలేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.