నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

NLG: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. మంగళవారం జలశయానికి ఇన్ ఫ్లో 64,511 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1650 క్యూసెక్కులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 555. 50 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 222. 0595 టీఎంసీల నీటి నిల్వ ఉంది.