వివాహిత పై లైంగిక దాడికి యత్నం
MHBD: పొలానికి వెళ్లి వస్తున్న ఓ వివాహిత పై అదే గ్రామానికి చెందిన ఒక దుండగుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన మరిపెడ మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన వివాహిత వారి సొంత పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా భూక్య బాలు వివాహితపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలోనే అటుగా వెళుతున్న స్థానికుడి సహాయంతో ఆమె తప్పించుకుని ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులకు తెలిపింది.