తెనాలిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
GNTR: తెనాలి మండలం ఖాజీపేటలోని ప్లాస్టిక్ రీసైక్లింగ్ కంపెనీలో విద్యుత్ షాక్‌తో బీహార్‌కు చెందిన కూలీ ఓం ప్రకాష్ (41) ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలోని డ్రయ్యర్‌ను శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.