భూసేకరణపై గ్రామసభ కార్యక్రమం

భూసేకరణపై గ్రామసభ కార్యక్రమం

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం భూ సేకరణ గ్రామసభ శుక్రవారం జరిగింది. తహశీల్దార్ చింత రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంతనపల్లి శివారులో 328.4 ఎకరాలు, ఊట్కూరు శివారులో 132.20 ఎకరాల భూమి అవసరమని రైతులకు వివరాలు చదివి వినిపించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు.