పెళ్లింట విషాదం.. ఉరేసుకుని యువకుడు మృతి

పెళ్లింట విషాదం.. ఉరేసుకుని యువకుడు మృతి

NZB: పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలో జరిగింది. మంగళ్‌పాడ్‌కు చెందిన ప్రతాప్‌ (30), కుటుంబ సభ్యుల మధ్య సోమవారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అతను అదే రోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈక్రమంలో నేడు ఠాణాకలాన్‌ శివారు గుట్టల్లో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.